తిరుమల ఇప్పుడు మీ చెంతనే..

వేంకటేశ్వరుడు సామాన్యమైన దేవుడు కాదు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది. మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా , ఆపద మొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి చెందిన ఆ దేవదేవుడు.. ఇప్పుడు మీ చెంతకు రాబోతున్నాడు.

Continue

మరో వీసా బాలాజీ..!

దేవాలయం అన్నది పూర్వికులు మనకు ఇచ్చిన అపురూప వారసత్వ సంపద. అదే సంపదనను మనం మన తర్వాతి తరాలకు అందించాలి. ఓ తిరుమల, ఓ అనంతపద్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే కారణం వాటి నిర్మాణ కౌశలాలే కాదు. వాటికున్న ఆధ్యాత్మికత, వాటిని నిర్వహించే భక్తుల శ్రద్ధ కూడా కారణమే....

Continue

దేవస్థాన సముదాయ ప్రతిష్టా మహోత్సవం

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే అద్భుత అవకాశం. జీవితంలో నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. సర్దార్ పటేల్ నగర్ కాలనీలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయంలో శ్రీ లక్ష్మీ గోదా దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జీవధ్వజ, విమాన శిఖర, జయ, విజయ, గరుడ, ఆంజనేయ, గణజనేయ, గణాధిప, బలిపీఠ ప్రతిష్టా మహోత్సవాన్ని....

Continue

తిరుమలేశుని కృపా కటాక్షాలతో...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.... భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. అందుకే శతాబ్దాలుగా తిరుమల అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు. ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకోసం దేశవిదేశాల నుంచి భక్తకోటి తిరుమలకు తరలి వస్తుంది. ఒక్కసారి దర్శించుకున్నా తనవి తీరక, మరలి మరలి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, ఏడేడు లోకాలను కాచే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసేందుకు ఏడు కొండలూ ఎక్కి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.

తిరుమల.. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడు కొండల మీద కొలువైన శ్రీనివాసుడిని కళ్లారా దర్శించేందుకు వేల మైళ్లు దాటి భక్తులు తరలి వస్తారు. కోరిన కొర్కెలీడేరె కలియుగ మహా దైవ దర్శనానికి కాలి నడకన కొండ కొండా ఎక్కి కోనేటి రాయుడిని చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎంత ప్రయాస పడినా.. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు... సకలం...సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వెండికొండపై కొలువు దీరిన కమలనాభుని దర్శనానికి... గంటల తరబడి వేచిఉన్నా... ఆ స్వామి గర్భ గుడిలో అడుగు పెట్టగానే...ఆ కష్టమంతా మైమరచిపోతారు. నిలువెల్లా కనులు చేసుకుని స్వామి కోసం ఎదురుచూస్తారు. సర్వంగా సుందరంగా అలంకరించుకున్న ఆ వెంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.

Video Gallery

image
image